ప్రముఖ హోటల్ బుకింగ్ సంస్థ ఓయో నూతన సంవత్సరంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు మేజర్ వయసు ఉన్నవారు ఐడీ ప్రూఫ్ చూపిస్తే సరిపోతుండగా, ఇకపై జంటలు తమ వివాహానికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని సంస్థ సీఈవో రితేశ్ అగర్వాల్ తెలిపారు.
మొదట మీరట్ నగరంలో అమలు జరపనున్న ఈ రూల్, తరువాత ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.
ఈ మార్పులు కుటుంబాలు, ఒంటరి ప్రయాణికుల భద్రత కోసమేనని ఓయో ప్రతినిధులు పేర్కొన్నారు. పెళ్లికాని జంటలపై ఆంక్షలు పెట్టడం ద్వారా హోటల్ బుకింగ్ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మారుస్తామనేది వారి ఉద్దేశం.
ఇతరులతో పోలిస్తే యువత ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొన్ని వర్గాలు దీనిని స్వాగతించగా, మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా అభివర్ణిస్తున్నారు.
అప్పుల్లో ఉన్న ఓయో సంస్థ ఈ నిర్ణయంతో మరింత ప్రతికూల ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.