fbpx
Monday, January 20, 2025
HomeInternationalటీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన పాకిస్తాన్ జట్టు!

టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన పాకిస్తాన్ జట్టు!

PAKISTAN-WINS-HIGHEST-T20MATCHES-IN-CALENDAR-YEAR

లాహోర్: అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల విషయంలో పాకిస్తాన్ జట్టు ఒక‌ ప్రపంచ రికార్డును సాధించింది. టీ20ఐలలో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అందరికంటే అత్యధిక విజయాలను సాధించిన మొట్టమొదటి జట్టుగా పాక్‌ రికార్డు నమోదు చేసింది.

ఈ సోమవారం కరాచీ వేదికగా పాకిస్తాన్ వెస్టిండీస్‌తో జరగిన తొలి టీ20లో విజయం సాధించి, ఒకే సంవత్సరంలో 18 విజయాలతో ఈ రికార్డును తమ ఖాతాలో జమ చేసుకుంది. అయితే చివరిగా ఆడిన 11 టీ20ల్లో 10 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ విజయం సాధించడం విశేషం. 2021 ఏడాది మొదలయ్యాక ఇప్పటి దాకా 27 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ ఏకంగా 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 6 మ్యాచ్‌ల్లో ఓటమి, మరో మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

ఇదిలా ఉండగా పాకిస్తాన్ జట్టు విజయాలలో కెప్టెన్‌ బాబర్‌ ఆజాం, మహమ్మద్‌ రిజ్వాన్‌ లు ఇద్దరు పెద్ద కీలక పాత్ర పోషించారు. 2021 ఏడాదిలో ఈ ఇద్దరూ ఆటగాళ్ళు 1208 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2021లో బాబర్‌ అజాం 853 పరుగులు సాధించగా, రిజ్వాన్‌ 1201 పరుగులు సాధించాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2021లో అద్బుతంగా రాణించిన పాకిస్తాన్‌, అనూహ్యంగా సెమీఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular