స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఉగ్రవాద గ్రూపులు టార్గెట్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. తెహ్రిక్-ఇ-తాలిబాన్ (TTP), ఐసిస్, బలూచిస్థాన్ గ్రూపులు మ్యాచ్ చూసేందుకు వచ్చిన విదేశీయులను కిడ్నాప్ చేయడానికి పథకం వేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో హై అలర్ట్ ప్రకటించింది. విదేశీ ఆటగాళ్లు, అభిమానులు లక్ష్యంగా మారవచ్చని, స్టేడియంలు, హోటళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఐసీసీ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాక్‌కు ఇది పెద్ద షాక్‌గా మారింది. ఇప్పటికే భారత్ భద్రతా కారణాల వల్ల పాక్‌లో ఆడడాన్ని తిరస్కరించి, తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతోంది.
మరోవైపు, పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. సెమీస్ చేరాలంటే అద్భుతం జరిగితేనే సాధ్యం.