మూవీడెస్క్: 2025 ఏప్రిల్ 10న భారతీయ సినీ ఇండస్ట్రీలో PAN India Stars మధ్య భారీ పోటీ జరగనుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ది రాజాసాబ్’ ఆ రోజు విడుదల కానుంది.
మిస్టరీ, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీకి ఎలాంటి అడ్డంకి ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు.
ఇదే రోజు, రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్’ మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఈ సినిమా ప్రభాస్ మూవీకి గట్టి పోటీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ పోటీలో మరో స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Hasan) కూడా చేరనున్నట్లు సమాచారం.
మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘థగ్ లైఫ్’ విడుదల తేదీ కూడా ఏప్రిల్ 10గానే ఉండబోతోందని టాక్.
‘నాయకన్’ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘థగ్ లైఫ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదే రోజు మూడు భారీ సినిమాలు విడుదల కావడం సినిమాలపై దృష్టిని మరింత పెంచుతోంది.
ప్రభాస్, యష్, కమల్ హాసన్ సినిమాల పోటీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.