టాలీవుడ్: టాలీవుడ్ లో కొన్ని చిన్న సినిమాలు అద్భుతాలు సృస్తిస్తాయి. కలెక్షన్లు రాబట్టలేకపోయిన కూడా ప్రేక్షకుడికి కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాయి. అలాంటి సినిమాలు ఇదివరకే చాలా వచ్చాయి. ఇపుడు అలాంటి ఒక సినిమా మన ముందుకు రాబోతున్నట్టు అనిపిస్తుంది. ‘పంచతంత్రం’ అంటూ ఈరోజు అనౌన్స్ చేసిన ఈ సినిమా సరిగ్గా అలాంటి వైబ్స్ ని క్రియేట్ చేయగలిగింది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ సినిమా అనౌన్స్మెంట్ తో పాటు ఈ సినిమాలో నటించే నటుల వివరాలు కూడా ప్రకటించారు.
ఈ సినిమా పోస్టర్ చూస్తే మనిషి కి సంబందించిన పంచేంద్రియాలు (కళ్ళు, చెవి, ముక్కు, చర్మం, నోరు) కి సంబందించిన సెన్సెస్ ని పోస్టర్ లో ప్రెసెంట్ చేస్తూ ‘5 సెన్సెస్ – 1 ఎమోషన్ ‘ అనే టాగ్ లైన్ తో స్టార్ కాస్ట్ వీడియో ని విడుదల చేసారు. హర్ష పులిపాక అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. టికెట్ ఫ్యాక్టరీ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై అఖిలేష్ వర్ధన్, సృజన యర్రబోలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కలర్ ఫోటో సినిమాని డైరెక్ట్ చేసిన సందీప్ ఈ సినిమాకి మాటలు అందిస్తున్నారు.
ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, దివ్య ద్రిష్టి, వికాస్ అలాగే చాలా రోజుల తర్వాత కలర్స్ స్వాతి ఈ సినిమాలో నటిస్తుంది. మరిన్ని ముఖ్య మైన పాత్రల్లో సముద్రఖని, బ్రహ్మానందం నటిస్తున్నారు. మెంటల్ మదిలో, చి.ల.సౌ లాంటి మంచి హిట్స్ అందించిన ప్రశాంత్ విహారి సంగీతంలో ఈ సినిమా రూపొందనుంది.