పెద్ది రిలీజ్ డేట్ షాక్.. నాని వెనక్కి తగ్గుతాడా?
రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం రిలీజ్ డేట్ 2026 మార్చి 27గా ఫిక్స్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. అదే రోజు ఆయన బర్త్‌డే కూడా కావడంతో, మేకర్స్ పర్ఫెక్ట్ డేట్ ఎంచుకున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. గ్లింప్స్‌తో కూడిన హైప్ సినిమాపై వేరే స్థాయిలో ఉంది.
అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ కూడా మార్చి 26న విడుదల కానుంది. అంటే చరణ్ మూవీకే ఫస్ట్ డే మాంచి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పదనే అంచనాలు మొదలయ్యాయి.
ఇద్దరూ స్టార్ హీరోలే అయినా, కలెక్షన్లపై ప్రభావం ఉంటుందనే డౌట్లు కనిపిస్తున్నాయి. నాని మేకర్స్ ముందు డేట్ అనౌన్స్ చేసినా, చరణ్ మూవీ హైప్ ఎక్కువగా ఉంది. దీంతో ‘ప్యారడైజ్’ డేట్ మారుతుందా అన్న చర్చ నడుస్తోంది.
నాని సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా ఉంటారని తెలుసు. అన్ని కోణాల్లో ప్లాన్ చేస్తారు. మరి ఈ పోటీ నుంచి తప్పించుకునేలా డేట్ మార్చేస్తారో లేక స్ట్రాంగ్‌గా నిలబడతారో చూడాలి. ఇప్పటికి దీనిపై ఆఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.