అమరావతి: దేశం మొత్తం కరోనా విజృంభిస్తూనే ఉంది. కాగా నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో 15 రోజుల పాటు పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్ అమలు కానుంది. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది.
కాగా కరోనా వల్ల మాజీ ఎంపీ సబ్బం హరి ఇవాళ కన్నుమూశారు. ఆయన గత 15 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15వ తేదీన ఆయన కరోనా బారిన పడ్డారు. మూడో రోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.
తదుపరి వైద్యుల సలహా వల్ల ఆయన విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు.