హైదరాబాద్: తెలంగాణ లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పాస్‌పోర్టు ఆఫీసు లో దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్‌లను ఒకే సారి 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
దేశంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదలకు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు సూపర్ స్పైడర్లుగా మారకూడదు అన్నే ఉద్దేశంతోనే ఈ నెల 31 వరకు అపాయింట్‌మెంట్లు 50 శాతం మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు.
ఈ నిర్ణయంతో ఎవరివైనా నిలిపివేసిన అపాయింట్‌మెంట్లలో మెడికల్, అత్యవసర ప్రయాణాలు ఉంటే దానికి సంబంధించిన సరైన డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. పాస్‌పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.