ఏపీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంక్రాంతి నాటికి గ్రామీణ రహదారుల అభివృద్ధిని పూర్తి చేయాలని నిర్ణయించారు.
జనవరి 14ని లక్ష్యంగా నిర్ణయించి, 861 కోట్ల నిధులు విడుదల చేసినప్పటికీ, ఇప్పటి వరకు పనుల పురోగతి అసంతృప్తికరంగా ఉందని సమాచారం.
కొన్ని జిల్లాల్లో పనులు ప్రారంభం కాలేదు, రాయలసీమ జిల్లాలు ఇప్పటికీ వెనుకబడిపోయాయి.
గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో కొంతమొత్తాన్ని నగరాల అభివృద్ధికి కేటాయించాలన్న ప్రతిపాదనపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
రహదారులు, భవనాల శాఖ మంత్రి ఈ నిధుల్లో 200 కోట్ల రూపాయలను నగరాల అభివృద్ధికి వినియోగించాలని కోరడంతో గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం తగ్గిందని పవన్ భావిస్తున్నారు.
ఇప్పటికే పలు సమావేశాల్లో పని వేగం పెంచాలని పవన్ సూచించినా, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
ఇతర జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో, పవన్ కల్యాణ్ తగిన చర్యలు తీసుకొని, రహదారుల అభివృద్ధిని నిర్దేశిత గడువులో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.