డిప్యూటీ సీఎం అవడంతో పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో పూర్తిగా అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న సినిమాలు ఆలస్యం కావడమేకాక, కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు అనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే తాజాగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని పవన్‌తో సినిమా చేయబోతున్నారన్న బజ్ హాట్ టాపిక్‌గా మారింది.
OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లు లాంటి మూడు భారీ ప్రాజెక్టులు ఇప్పటికే పవన్ లైన్‌లో ఉన్నాయి. వీటిలో మే 9న విడుదలగా చెప్పిన ‘హరి హర’ ఇంకా షూటింగ్‌లోనే ఉంది. OGకు పవన్ డేట్స్ పూర్తిగా ఖరారవ్వలేదు. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్ అనే మాటే కష్టంగా మారింది.
అయితే గోపిచంద్ మాత్రం 2026లో పవన్ కోసం ప్లాన్ చేస్తూ, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందట. ఇప్పటికే ‘జాట్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్, పవన్‌తో సినిమా చేయాలన్నది తన లాంగ్ టైమ్ డ్రీమ్ అని చెబుతున్నారట.
ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ పై ఫుల్ హైప్‌లో ఉన్నారు. OG, భగత్ సింగ్‌ల తర్వాత ఇది పవన్ కెరీర్‌కు కొత్త మాస్ ఎలివేషన్ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ నిజంగా మొదలవుతుందా లేక రూమర్‌గా మిగిలిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.