తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో, టాలీవుడ్ యువ నటి అనన్య నాగళ్ల తనవంతు సాయం ప్రకటించడం తెలిసిందే.
ఆమె ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు విరాళం అందజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
హీరోయిన్లలో విరాళం ప్రకటించిన మొదటి వ్యక్తిగా అనన్య నిలిచింది. ఇది చిన్న మొత్తమే అయినప్పటికీ, ఆమె ది పెద్ద మనసు అని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనన్య నాగళ్ల విరాళంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2.5 లక్షల విరాళం అందించిన అనన్య నాగళ్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి, ప్రభుత్వానికి మీ చేయూత చాలా ప్రోత్సాహకరంగా ఉంది, అని పవన్ కల్యాణ్ తరఫున ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
దీనికి అనన్య వినయపూర్వకంగా స్పందిస్తూ, “ధన్యవాదాలు సర్. మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి” అని ట్వీట్ చేసింది.