విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న వరదల ప్రభావాన్ని సమీక్షించి, బాధితుల సహాయార్థం రూ.1 కోటి విరాళం ప్రకటించారు.
ఈ రోజు జరిగిన సమావేశంలో, ఏపీ సీఎం సహాయ నిధికి ఈ విరాళం అందించనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సెప్టెంబరు 4న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ మొత్తాన్ని అందజేస్తానని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి, వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను ప్రత్యక్షంగా మానిటర్ చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, విపత్తుల నిర్వహణ శాఖ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.