మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం మళ్ళీ సినిమా షూటింగ్స్ కి సిద్ధమవుతున్నారు. రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవన్, షూటింగ్స్ కి కొంత విరామం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే, ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ త్వరలో పూర్తి కాబోతున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్, సినిమాల వైపు తిరిగి దృష్టి పెట్టడం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.
పవన్ కళ్యాణ్ మొదట హరిహర వీరమల్లు సినిమాను సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ చేసేందుకు సిగ్నల్ ఇచ్చారు.
ఈ సినిమాకి మొదట క్రిష్ దర్శకత్వం వహించగా, తర్వాత ఆయన స్థానంలో జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయబోతున్నారు.
చిత్రీకరణ విజయవాడలో గ్రీన్ మ్యాట్ స్టూడియోలో జరగనున్నట్లు సమాచారం. ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, ఓజీ సినిమా షూటింగ్ కోసం సుజిత్ దర్శకత్వంలో విశాఖపట్నంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అక్టోబర్ లో పవన్ ఈ ప్రాజెక్ట్ లో పాల్గొనబోతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
ఈ మూడు సినిమాలు కూడా ఒకే ఏడాదిలో పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. తొలుత ఓజీ సినిమా 2025లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
హరిహర వీరమల్లు చిత్రాన్ని డిసెంబర్ 2024 లో విడుదల చేయాలని నిర్మాతల అభిప్రాయం ఉన్నప్పటికీ, అది కొంచెం కష్టంగా ఉంటుందని అనిపిస్తోంది.