మూవీడెస్క్: పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను హీరోగా మళ్లీ తెరపై చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఇక ‘హరిహర వీరమల్లు’ సినిమా 2025 మార్చి 28న విడుదల కానుండగా, ‘ఓజీ’ సినిమాను మరింత ఆలస్యంగా 2025 దసరాకి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.
‘ఓజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
ఈ చిత్రంపై పవన్ కళ్యాణ్ మంచి అభిప్రాయంతో ఉన్నారని, అభిమానులు కూడా ఆ సినిమా కోసం చాలా అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ కూడా ఇంకా 75% ఉండటంతో, ఈ సినిమా 2025 తర్వాతే పూర్తి అవుతుందనే సమాచారం వినిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే, పవన్ పొలిటికల్ షెడ్యూల్ మధ్య సినిమా షూటింగ్ లు జరగడం వల్ల మూడు సినిమాల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.