పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరి హర వీర మల్లు చివరకు మే 9న విడుదల కానుంది. ముందుగా మార్చి 28న రావాల్సిన ఈ సినిమా, రాజకీయ కమిట్మెంట్స్ కారణంగా వాయిదా పడింది. ఇంకా 20 రోజుల షూటింగ్ మిగిలి ఉండటంతో, దర్శకుడు ఏఎమ్ జ్యోతి కృష్ణ పనులను వేగంగా పూర్తి చేయనున్నాడు.
ఇదిలా ఉంటే, హరి హర వీర మల్లు విడుదలైన 4-6 నెలలలోనే పవన్ మరో బిగ్ మూవీతో రావడానికి సిద్ధమవుతున్నాడు. OG ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరిచిన సినిమా. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, పవన్ మాస్ ఇమేజ్‌ను మరింత పీక్‌కు తీసుకెళ్లనుందని టాక్. డైలాగ్స్, ఫైట్ సీక్వెన్స్‌లు పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు.
టీమ్ దీపావళి లేదా క్రిస్మస్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ OG విడుదలను సెప్టెంబర్ లేదా డిసెంబర్‌కు ప్లాన్ చేస్తోంది. పవన్ రాజకీయ షెడ్యూల్‌కు అనుగుణంగా షూటింగ్ వేగంగా కంప్లీట్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు.
హరి హర వీర మల్లు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇక OG పూర్తిగా మాస్ యాక్షన్ మూవీగా ఉండడంతో, 2025లో పవన్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.