మంగళగిరి: జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంలో నాని చేసిన తప్పులను ఎండగట్టారు. భార్య పేరుతో గిడ్డంగులు పెట్టడంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
రేషన్ బియ్యం మాయమైన విషయాన్ని దాస్తే ఎలా అని నిలదీశారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్, అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టినవాళ్లు ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు.
వైసీపీ పాలనలో చేసిన తప్పులు ఇప్పుడు కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుటుంబంపై నాటి వైసీపీ నేతల వ్యాఖ్యలను గుర్తుచేసి, ఇప్పుడు మార్ఫోవాలని పిలుపునిచ్చారు.
డిప్యూటీ సీఎం వైసీపీ ఆరు నెలల పాలనను, ఎన్డీయే ఆరు నెలల పాలనను బేరీజు వేయాలంటూ సవాలు విసిరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు, అదే విధంగా రాష్ట్రంలో కూడా అభివృద్ధి పనులు చేపట్టతామని చెప్పారు.
ప్రజా సమస్యలపై ఫోకస్ చేసి బాధ్యతతో పనిచేస్తున్నామన్నారు. “మా పాలనకు, వైసీపీ పాలనకు మధ్య భిన్నత తెలుసుకోవాలంటే ప్రజలు బేరీజు వేయాలి,” అన్నారు పవన్.