ఏపీ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత రోజున పార్వతీపురం మన్యం జిల్లాలోని బాహుజోల గ్రామంలో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు.
గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే పవన్ కళ్యాణ్ అంకితభావం స్ఫూర్తిదాయకమని లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
లక్ష్మీనారాయణ తన ట్వీట్‌లో, గిరిజన సంక్షేమం కోసం రాజ్యాంగంలోని 46, 244, 244ఏ, 275(1) వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఉప ప్రణాళికల కింద నిధులను గిరిజనులకు సమర్ధంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచించారు.
గిరిజనుల విద్య, భూ హక్కులు, సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నిధులను అట్టడుగుస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని పవన్‌కు సూచించారు.
లక్ష్మీనారాయణ మాటలు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, గిరిజనుల అభివృద్ధికి మరింత ప్రోత్సాహాన్నిస్తాయని గిరిజన సంక్షేమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.