ఏపీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో జల్ జీవన్ మిషన్‌పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం రూ.4 వేల కోట్లను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. నీటి సరఫరా, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పవన్ అన్నారు.
జన్ జీవన్ మిషన్‌ను మరింత బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని చెప్పారు.
ప్రజలకు నాణ్యమైన నీటిని అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని, నీటి సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని దీర్ఘకాలిక పరిష్కారాలకు కృషి చేస్తున్నామని తెలిపారు.
జనవరి నెలాఖరుకు డీపీఆర్ పూర్తిచేసి జల్ శక్తి మంత్రిత్వ శాఖకు పంపించనున్నట్లు పవన్ వెల్లడించారు.
ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు అందించడమే ప్రధాని మోదీ కల అని పవన్ అన్నారు. నీటి సమస్యల పరిష్కారానికి రూ.70 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా నీటి సమస్యల్ని సమర్థంగా పరిష్కరించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు.