టాలీవుడ్: రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ ‘వకీల్ సాబ్’ సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ సినిమాతో ఒక వీకెండ్ లోనే సినిమాని లాభాల వైపు మలిచాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు కమిట్ అవుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో ఒకేసారి నటిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు తో పాటు మళయాళం సినిమా అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్ రీమేక్ సినిమా. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాని డైరెక్ట్ చేసిన సాగర్ చంద్ర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడు.
కొంచెం గ్యాప్ తీసుకుని ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టారు. అతి తక్కువ డేట్స్ లో ఈ సినిమా పూర్తి చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పాత్రలో నటించనున్నట్టు ఈ రోజు ఒక పోస్టర్ విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ లో పోలీస్ యూనిఫామ్ వేసుకున్న పిక్ ఒకటి బ్యాక్ లుక్ షేర్ చేసి ‘భీమ్లా నాయక్’ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియా లో షేర్ చేసారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తున్నారు. థమన్ సంగీతం లో రూపొందుతున్న ఈ సినిమా మరో కరోనా వేవ్ లేకుంటే ఈ ఏడాది చివరికల్లా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.