fbpx
Sunday, April 27, 2025
HomeMovie Newsపవర్ స్టార్ దసరా స్పెషల్

పవర్ స్టార్ దసరా స్పెషల్

Pawankalyan MovieWith SitaraEntertainments

టాలీవుడ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. అంతకముందు దాదాపు రెండు సంవత్సరాలకి ఒక సినిమా తీసే హీరో ఒకేసారి ఒక సినిమా షూటింగ్ లో ఉండి రెండు సినిమాలు ప్రకటించి మరో సినిమా ఇవాళ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక సినిమా ప్రకటన ఇవాళ విడుదలైంది. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటించబోతున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు‘ సినిమాకి దర్శకత్వం వహించిన ‘సాగర్ కె చంద్ర’ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

వకీల్ సాబ్ షూటింగ్ ఇంకొక షెడ్యూల్ ముగించి క్రిష్ సినిమా కూడా త్వరగా ముగించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయితే తర్వాత హరీష్ శంకర్ తో, సురేందర్ రెడ్డి తో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ సినిమాకూడా పవన్ కళ్యాణ్ వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో ఒక సూపర్ కాప్(పోలీస్) రోల్ లో నటించబోతున్నట్టు నిర్మాతలు ఒక వీడియో ద్వారా తెలియ చేసారు. ఇప్పటికే మళయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్’ రైట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. పోలీస్ రోల్ మరియు సితార బ్యానర్ అంటే అదే సినిమా రీ-మేక్ చెయ్యబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన అయితే ఏదీ లేదు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోంచి ఎదో ఒక అప్డేట్ వస్తుందనుకున్న అభిమానులకి దసరా స్పెషల్ గా ఒక కొత్త సినిమా ప్రకటన ఖుషి చేసింది.

Power Star Pawan Kalyan - Sithara Entertainments - Production No 12 Announcement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular