టాలీవుడ్: కరోనా తర్వాత ఆగిపోయిన సినిమాలన్నీ సంక్రాంతి నుండి వరుసపెట్టి విడుదలవుతున్నాయి. అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు చాలా విడుదలయ్యాయి. మిగిలిన కొంచెం పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఇప్పుడు విడులవుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత ఇప్పటి వరకు చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వగా కొన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా కరోనా తర్వాత ఎలా ఉంటుందో అన్న అనుమానాల్ని తెరతీస్తూ తెలుగు సినిమా అభిమానులు సినిమాలని థియేటర్లలో సాదరంగా స్వాగతించారు. మంచి కలెక్షన్స్ తో మూడు సినిమాలని బ్లాక్ బస్టర్ చేసారు.
ఈ వారం మాత్రం ఒక స్పెషల్ సినిమా విడులవుతుంది అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ టాప్ లీగ్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ రేపు విడుదలవుతుంది. మరో విశేషం ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ కం బ్యాక్ అవుతున్న పవర్ స్టార్ సినిమా ఇది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ అడ్వాన్స్ బుకింగ్ లో ట్రెండ్ చూపించారు. రేపు కనీసం కాంపిటీషన్ కి కూడా వేరే సినిమాలు లేకపోవడం తో దాదాపు అన్ని థియేటర్లలో, మల్టీప్లెక్స్ స్క్రీన్ లలో అభిమానులు దేవుడిలా పిల్చుకునే పవన్ కళ్యాణ్ ప్రత్యక్షం అవబోతున్నాడు. ఎలా చూసుకున్నా ఈ వారం వకీల్ సాబ్ దే అని చెప్పుకోవచ్చు.
అంతే కాకుండా కరోనా కారణంగా వచ్చే వారం నుండి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి తెలియదు. థియేటర్లలో సగం సీటింగ్ కె పర్మిషన్ ఇస్తారా లేక మొత్తానికే థియేటర్లు మూసివేస్తారా అనే క్లారిటీ లేకపోవడం తో వచ్చే వారం విడుదల అవ్వాల్సిన కొన్ని సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి.
ఇప్పటివరకు మంచి హిట్ కానీ మంచి రిలీజెస్ కానీ జరగని కోలీవుడ్ లో ధనూష్ నటించిన ‘కర్ణన్’ సినిమా రేపు విడుదలవుతుంది. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి, కంటెంట్ పరంగా కూడా టీజర్స్ ద్వారా ఈ సినిమా పై ఆసక్తి రేకెత్తించించి సినిమా టీం.