టాలీవుడ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ గా ‘వకీల్ సాబ్’ సినిమా రూపుదిద్దుకుంటుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడం తో ప్రొమోషన్ ల జోరు పెంచుతున్నారు. మ్యూజికల్ ఫెస్ట్ అని కొన్ని కాలేజెస్ లో సినిమా టీం ప్రొమోషన్ చేస్తూ వచ్చింది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఒక సిటీ లో ఉండే మధ్య తరగతి కి చెందిన ముగ్గురు అమ్మాయిలు లైంగిక దాడికి గురైతే పవర్ లో ఉన్న వ్యక్తుల వలన అమ్మాయిలే తప్పని వాళ్ల మీద నింద మోపే ప్రయత్నం జరిగితే వాళ్ళని కాపాడే పాత్రలో వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ ఈ సినిమా లో నటిస్తున్నాడు.
హిందీ లో విడుదలై సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా ఈ సినిమా రాబోతుంది. హిందీ లో ఉన్న సీన్స్ ఉన్నది ఉన్నట్టు తీసినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. అవే కాకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఫైట్స్ సీన్స్ ఆడ్ చేసినట్టు అర్ధం అవుతుంది. ఓవరాల్ గా ఎలాంటి సపోర్ట్ లేని ముగ్గురు అమ్మాయిలకి కోర్ట్ లో కేసు వాదించి వాళ్ళకి సపోర్ట్ గా నిలిచే లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించాడు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు. థమన్ సంగీతం లో రూపొందిన ఈ సినిమా ఆల్బమ్ లోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఓహ్ మై ఫ్రెండ్, ఎం.సి.ఏ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 9 న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుంది.