
టాలీవుడ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లోకి రానని చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాడు. కానీ కొన్ని కారణాల వలన మళ్ళీ సినిమాలు మొదలు పెట్టాడు. తన కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఎపుడో మొదలు పెట్టారు కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వలన కొన్ని రోజులు, కరోనా వలన కొన్ని నెలలు ఆలస్యం అయింది. ఎట్టకేలకి కరోనా తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టి శర వేగంగా పవన్ కళ్యాణ్ పార్ట్ ఈరోజుతో పూర్తి చేసారు. వకీల్ సాబ్ సినిమా హిందీ లో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా కి తెలుగు అఫిషియల్ రీమేక్ గా రూపొందుతుంది. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి 2021 మార్చ్ వరకు ఈ సినిమాని విడుదల చెయ్యాలని నిర్మాత దిల్ రాజు చూస్తున్నాడు.
శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఓహ్ మై ఫ్రెండ్, ఎంసీఏ లాంటి సినిమాలని రూపొందించిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి మొదటి సారి పవన్ కళ్యాణ్ కి సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘మగువ మగువ’ అనే పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ వరుసగా 3 ,4 సినిమాలు ఒప్పుకున్నాడు. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏ సినిమా మొదలు పెడతాడు అనేది ఇంతవరకు తెలియదు. మొదలు అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్ రీమేక్ మొదలు పెట్టి అది పూర్తి చేసి క్రిష్ చేసే సినిమా షూటింగ్ లో జాయిన్ అవనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.