టాలీవుడ్: టాలీవుడ్ లో రిలీజ్ డేట్ ల సునామి కొనసాగుతూనే ఉంది. ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ విడుదల తేదీ ఈరోజు ప్రకటించారు. రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి కం బ్యాక్ అయ్యి పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి సినిమా కావడం తో ఈ సినిమా పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని రోజుల నుండి అన్ని సినిమాల అప్ డేట్ లు వస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా విడుదల తేదీ ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ళ ఎదురు చూపులు ఫలించాయి. ఏప్రిల్ 9 న ఈ సినిమా విడుదల చేయనున్నట్టు ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు.
బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , శిరీష్ ఈ సినిమాని నిర్మించారు. ఓహ్ మై ఫ్రెండ్, ఏం.సి.ఏ సినిమాలకి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా టీం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. హిందీ లో విడుదలైన పింక్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో శృతి హాసన్, నివేత థామస్, అంజలి, అనన్య నాగళ్ళ నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.