స్పోర్ట్స్ డెస్క్: CSK vs PBKS: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుసగా నాలుగో ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (103) అద్భుత శతకం నమోదు చేశాడు.
లగ్ ఆర్డర్‌లో శశాంక్ సింగ్ (52 నాటౌట్), మార్కో యాన్సెన్ (34 నాటౌట్) చివర్లో చెలరేగి స్కోరు పెంచారు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీయగా, ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
లక్ష్యఛేదనలో చెన్నై జట్టుకు డేవాన్ కాన్వే (69) అంచనాలకు తగ్గ స్కోరు ఇచ్చినా, తర్వాతి ఆటగాళ్లు పూర్తిగా నిలదొక్కుకోలేకపోయారు. రచిన్ రవీంద్ర (36), శివమ్ దూబె (42), ధోనీ (27) ప్రయత్నించినా విజయం అందుకోలేకపోయారు.
పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా, మ్యాక్స్‌వెల్, యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీసి చెన్నై రన్ చేజ్‌ను అడ్డుకున్నారు. చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది.
ఈ ఓటమితో సీఎస్కేకు వరుసగా నాలుగో పరాజయం ఎదురవగా, పంజాబ్ తమ మూడో విజయం నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్ రేస్‌లో చెన్నై స్థానం మరింత క్షీణించింది.