టాలీవుడ్: దాదాపు అందరు కొత్త నటులు నటించిన ఒక సైన్స్ థ్రిల్లర్ సినిమా ‘పీనట్ డైమండ్’ విడుదలకి సిద్దమవుతుంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు విడుదల చేసి టీం కి విషెస్ తెలియచేసారు.
‘త్రేతా యుగం లో మంచి చెడు మధ్య యుద్ధం రాముడు, రావణుడు లాంటి ఒక ప్రపంచంలో ఉన్న ఇద్దరు మనుషుల మధ్య ఉండేది. ద్వాపర యుగంలో పాండవులు, కౌరవుల రూపంలో ఒకే కుటుంబంలో ఉండేది. కలియుగంలో ఒకే మనిషి మెదడులో మంచి చెడు ఉండే మనిషితో మనిషి చేసే యుద్ధం’ అన్నట్టు ట్రైలర్ ప్రారంభం అయింది. ట్రైలర్ లో రెండు టైం పీరియడ్స్ చూపించారు. 30 సంవత్సరాల క్రితం డైమండ్స్ అన్వేషించే సీన్స్ కొన్ని చూపించి ప్రెసెంట్ టైం పీరియడ్ లో డైమండ్స్ ని ల్యాబ్ లో ప్రయోగం చేసే మరో పాత్రని చూపించి ఈ రెండు పాత్రలకి ఎదో కనెక్షన్ ఉన్నట్టు ఆ కనెక్షన్ ఏంటి అనేది సస్పెన్స్ ఉండేట్లు ట్రైలర్ కట్ చేసారు.
ట్రైలర్ వరకు సినిమా పైన ఆసక్తి కలుగచేసింది. సైన్స్ మరియు సస్పెన్స్ కాన్సెప్ట్ జోడించి సినిమా తీసినట్టు అర్ధం అవుతుంది. ఇందులో అభినవ్ సర్ధార్ పటేల్, రామ్ కార్తిక్ , చాందిని లాంటి నటులతో పాటు శుభలేఖ సుధాకర్, సుమన్ లాంటి సీనియర్ నటులు కూడా కొన్ని పాత్రల్లో మెరిశారు. అభినవ్ సర్దార్ మరియు త్రిపర్ణ వెంకటేష్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. త్రిపర్ణ వెంకటేష్ రచన మరియు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.