పెద్ది గ్లింప్స్ హవా: చరణ్ బ్లాస్ట్‌తో రికార్డులు బ్రేక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ గ్లింప్స్ టాలీవుడ్‌లో రికార్డుల వేట మొదలుపెట్టింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ఫస్ట్ షాట్ వీడియో శ్రీరామనవమి సందర్భంగా విడుదల కాగా, ఇది 24 గంటల్లో 30.6 మిలియన్ వ్యూస్‌ను సాధించింది.
ఇంతవరకు ఈ రికార్డు ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్ పేరిట ఉండగా, ఇప్పుడు చరణ్ అదే రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. గుంటూరు కారం, పుష్ప 2, ప్యారడైజ్ లాంటి టాప్ టీజర్లు కూడా పక్కకు నెట్టేశాడు. పెద్ది గ్లింప్స్‌లో చరణ్ మాస్ లుక్, బ్యాట్ సీన్ ట్రెండ్ అవుతోంది.
బుచ్చిబాబు స్టైల్, రత్నవేలు విజువల్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. అన్నీ కలసి ఈ చిత్రానికి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. గేమ్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కాబోతోంది.
ఇప్పటికే రికార్డు వ్యూస్‌తో చరణ్ తన మార్క్ చూపించగా, సినిమా విడుదలయ్యే సరికి ఇంకెన్నో రికార్డులు పడిపోవడం ఖాయం అంటున్నారు అభిమానులు.