రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ 2026 మార్చి 27న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇప్పుడైతే హైదరాబాద్‌లో ఓ స్పెషల్ షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో రైల్వే స్టేషన్ సెట్‌లో చరణ్‌పై కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇది సినిమాకు హైలైట్ సీన్‌గా నిలవబోతుందని, కథ మలుపు తిరిగే పాయింట్ కూడా ఇదే అని బజ్. దీంతో సోషల్ మీడియాలో #PeddiRailwayFight అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
ఈ సీన్‌లో చరణ్ పవర్ ప్యాక్డ్ లుక్‌తో అదరగొడతారని, మాస్ ఫ్యాన్స్‌కు ఇది స్పెషల్ ట్రీట్ అవుతుందని టీం వర్గాలు చెబుతున్నాయి. చరణ్ యాక్షన్ స్టైల్‌కు యూనిక్ మేకింగ్ జతకలిస్తే మరో హై వోల్టేజ్ మోమెంట్ గ్యారెంటీ అంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ హైలైట్ కానుంది. షూటింగ్ పూర్తయిన వెంటనే గ్రాండ్ ప్రమోషన్లకు ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది.