మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఊహించని వేగంతో కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు పూర్తవగా, చరణ్ షెడ్యూల్ జూలై లేదా ఆగస్టు వరకు పూర్తిచేసేలా స్పెషల్ ప్లాన్ తయారైంది.
బుచ్చిబాబు తన సుకుమార్ శైలి ప్లానింగ్‌తో ఒక్క సీన్ కూడా వాయిదా వేయకుండా షూట్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే క్లైమాక్స్ పార్ట్ షూట్ అయిపోయినట్టు సమాచారం. ఆ ఎమోషనల్ హైపాయింట్ సినిమా సౌల్‌గా నిలవబోతుందని యూనిట్ చెబుతోంది. ఇక మిగిలిన క్యారెక్టర్లు, క్రికెట్ ఎపిసోడ్స్ డిసెంబర్ లోపల పూర్తి చేసేలా ఫుల్ షెడ్యూల్ ప్లాన్ రెడీ అయింది.
చరణ్ ఓ పల్లెటూరి యువకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో కొత్తగా డిజైన్ చేసిన లుక్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఆయన నటించిన ఎమోషనల్ సీన్స్ బుచ్చిబాబుని కూడా ఆశ్చర్యపరిచాయట. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మీద AR రెహమాన్ ఇప్పటికే పని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా, 2026లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్ స్పీడ్ చూసిన తర్వాత ఫ్యాన్స్ ఆశలు రెట్టింపు అయ్యాయి.