న్యూఢిల్లీ: ప్రముఖ యాపిల్ కంపెనీ మొబైల్ లను తయారు చేసే పెగట్రాన్ భారత దేశంలో పెట్టుబడూలు పెట్టడనికి ఆసక్తి చూపుతోంది. తైవాన్ కు చెందిన పెగట్రాన్ కంపెనీ ఇప్పటీకే భారత్ లోని చెన్నై నగరాన్ని తమ పరిశ్రమ నెలకొల్పడానికి అనువైనది గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే యాపిల్ మొబైల్ లను తయారుచేసే కంపెనీలు అయిన విస్ట్రన్ మరియు ఫోక్సన్ కంపెనీలు సైతం భారత్ లో తయరీకి పరిశ్రమలు స్థాపించి ఉత్పత్తిని ప్రారంభించాయి. తాజాగా పెగట్రాన్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం హర్షించదగ్గ విషయం అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
పెగట్రాన్ కార్యాలయాలు, ఉద్యోగులు చైనాలో అత్యధికంగా ఉన్నప్పటికీ, భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవడం ఒకింత ఊరటనిచ్చే అంశం.
పెగట్రాన్ చైనాను కాదని భారత దేశానికి ప్రాముఖ్యత ఇవ్వడం సంతోషకరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో దేశంలో పెట్టుబడులు పెట్టడం శుభసూచికమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత సంవత్సరం యాపిల్ భారత దేశంలో 150కోట్ల డాలర్లు టర్నోవర్ చేసిందని యాపిల్ సంస్థ తెలిపింది. ఇంతకు ముందు మార్చి నెలలో పెగట్రాన సీఈఓ లియా షీ గ్యాంగ్ స్పందిస్తూ.. క్లయింట్ల సూచనలు, ప్రభుత్వాల పాలసీల అనుగుణంగా ఏ దశంలో పెట్టుబడులు పెట్టాలనే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.