fbpx
Friday, December 13, 2024
HomeTop Movie Newsఆకట్టుకుంటున్న రాఘవేంద్రరావు మార్క్‌ పెళ్లి సందడి టీజర్‌!

ఆకట్టుకుంటున్న రాఘవేంద్రరావు మార్క్‌ పెళ్లి సందడి టీజర్‌!

PELLISANDADI-TEASER-ATTRACTING-MOVIE-LOVERS-WITH-RAGHAVENDRARAO-MARK

మూవీ డెస్క్: టీజర్ సమాచారం : ప్రముఖ టాలీవుడ్ హీరో సీనయర్ నయకుడైన శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందడి. కాగా శ్రీ లీల చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలనే కల్పిస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా ఈ మూవికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిత్ విడుదల చేసింది‌. ‘సహస్రకు పెళ్లి నాతోనా, లేక నువ్వు తెచ్చిన తొట్టిగ్యాంగ్ లీడర్‌తోనా’ అంటూ రోషన్ పలికే డైలాగ్ చాలా‌ హైలెట్‌గా నిలిచింది.

కాగా ఈ మూవీ కి దర్శకత్వ పర్యవేక్షను చేస్తున్న దిగ్గజ దర్శకుడైన రాఘవేంద్ర రావు మార్క్‌ ఈ టీజర్ లోని ప్రతి ఫ్రేములో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల అవనుంది. గౌరి రోణంకి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రానికి సంయుక్త నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular