మూవీడెస్క్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధినేత టీజీ విశ్వప్రసాద్, ఈ ఏడాది ఎన్నో ప్రాజెక్ట్స్‌కి హడావుడిగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
చిన్న చిత్రాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకు విస్తరించి నిర్మాణం చేస్తూ యంగ్ టాలెంట్‌కి, కమర్షియల్ డైరెక్టర్స్‌కి అవకాశాలు ఇచ్చారు.
అయితే ఈ ఏడాది ‘ఈగల్,’ ‘మనమే,’ ‘మిస్టర్ బచ్చన్,’ ‘విశ్వం,’ ‘స్వాగ్,’ ‘నరుడి బ్రతుకు నటన’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే, వీటిలో ఒక్కటి కూడా కమర్షియల్ సక్సెస్ పొందకపోవడం వల్ల పీపుల్స్ మీడియా భారీ నష్టాల బాట పట్టింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టీజీ విశ్వప్రసాద్ తన నిర్మాణంలో తీసుకున్న ప్రాజెక్ట్స్ వల్ల ఈ ఏడాదిలో ఏకంగా 100 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు.
ఫైనాన్సియల్ లాస్ గురించి ఆయన బహిరంగంగా చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ ఈ లాస్‌ను అధిగమించి, మరలా మునుపటి స్థాయికి రావాలనుకుంటున్నట్లు ఆయన ధైర్యంగా ప్రకటించారు.
2025లో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్,’ తేజ సజ్జా ‘మిరాయ్,’ సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ సినిమాలు భారీ బడ్జెట్‌తో విడుదల కానున్నాయి.
అలాగే అడివి శేష్ నటిస్తున్న ‘గూఢచారి 2,’ ‘మహాకాళి’ చిత్రాలు కూడా అంచనాలను అందుకునేలా ఉన్నాయి.