fbpx
Saturday, January 18, 2025
HomeAndhra Pradeshరేషన్ బియ్యం మాయం: పేర్ని నాని కుటుంబానికి నోటీసులు

రేషన్ బియ్యం మాయం: పేర్ని నాని కుటుంబానికి నోటీసులు

perni-nani-family-ration-rice-case

ఏపీ: రేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఈ నోటీసుల ద్వారా నాని కుటుంబ సభ్యులు దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది.

కేసులో మాయమైన బియ్యం విలువ చెల్లించేందుకు అధికారుల నోటీసులకు స్పందించిన నాని కుటుంబం మొదటి విడతలో రూ.1 కోటి, నిన్న మరో రూ.70 లక్షలు చెల్లించారు.

మొత్తం రూ.1.7 కోట్ల డీడీలు అప్పగించగా, ఈ చర్యలతో వారికి కేసు నుంచి తప్పించుకునే మార్గం కల్పించారనే విమర్శలు వస్తున్నాయి.

ఇక ప్రధాన నిందితురాలు గోదాము యజమాని జయసుధపై కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మాయమైన బియ్యం 3,708 బస్తాలకు మించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసు పర్యవసానంగా పేర్ని నాని నిన్న అజ్ఞాతం వీడి మాజీ మంత్రులు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular