న్యూఢిల్లీ : దేశంలో ఇటీవలే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దాంతో ఇన్నాళ్ళు రెశ్ట్ తీసుకున్న పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ తమ వేగాన్ని పెంచాయి. ఈ నెల మే 4 నుండి పెరుగుతున్న ధరలు ఈ శుక్రవారంతో ఎనిమిదవసారి పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఈ రోజు పెట్రోలుపై 29 పైసలు, డీజిల్ ధరలు 34 పైసలు పెరుగుదల నమోదు చేశాయి. ఈ పెంపుతో పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.100 మార్కు దాటేశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఒక లీటరుకు 100 రూపాయలు దాటింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధరరూ .100 లకు చేరువలో ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 92.34 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు 82.95 రూపాయలు పలుకుతోంది.
ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.1.94, డీజిల్‌పై రూ.2.22 పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధరరూ .98.65, డీజిల్‌రూ .90.11. చెన్నైలో పెట్రోల్ ధర రూ .94.09 రూ .87.81 . కోల్‌కతాలో రూ .92.44 కు లీటరుకు రూ .85.79. అమరావతిలో పెట్రోలు ధర రూ. 98.49, డీజిల్ ధర రూ. 92.39 గా ఉంది.