బిజినెస్: దీపావళి వేళ కొత్త తరహా బీమా పాలసీని ఫోన్‌పే తీసుకువచ్చింది. ఈ పండుగ సందర్భంగా టపాసుల వల్ల గాయపడే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, బాణసంచా ప్రమాదాల్లో పడిన వారికి సాయంగా నిలిచేలా “ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్” అనే కొత్త పాలసీని ఫోన్‌పే లాంచ్ చేసింది. కేవలం రూ.9 చెల్లించడం ద్వారా రూ.25,000 వరకు కవరేజీ లభిస్తుండటం ఈ పాలసీ ప్రత్యేకత.
ఫోన్‌పే ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ ఎక్కడ లభిస్తుందో తెలుసా?
ఫోన్‌పే యాప్ ద్వారా ఈ బీమా పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఈ కవరేజీ అందుబాటులో ఉంటుంది. ఫోన్‌పే యూజర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు (భార్య, పిల్లలు) మొత్తం నాలుగు మంది వరకు కవరేజ్ పొందవచ్చు.
పాలసీ కొనుగోలుకు మార్గం:
- ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయాలి.
- ఇన్సూరెన్స్ సెక్షన్‌లోకి వెళ్లి “ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్” పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్‌పై కవరేజ్ వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
- కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేసి, పాలసీ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, ఈ మెయిల్ ఐడీ వంటి వివరాలు నమోదు చేయాలి.
- టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించి, ప్రీమియం చెల్లించాలి.
ఈ విధంగా దీపావళి వేళ మీ కుటుంబం కోసం ఒక సురక్షితమైన బీమా తీసుకోవడం ద్వారా పండుగను మరింత భద్రంగా జరుపుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి తీసుకొచ్చిన ఈ ప్రత్యేక బీమా మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ అందిస్తుంది.