మూవీడెస్క్: తమిళ స్టార్ విజయ్ నటించిన ది గోట్ మూవీపై పైరసీ తీవ్ర ప్రభావం చూపుతోంది. సినిమా ఇంకా ఓటీటీలో విడుదల కాకుండానే, హై క్వాలిటీ ఆడియోతో HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడం మేకర్స్‌కి పెద్ద షాక్‌గా మారింది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ, అక్టోబర్ 3న విడుదలయ్యే ముందు నుంచే పైరసీ రూపంలో ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది.
తమిళ్ రాకర్స్, తమిళ్ బ్లాస్టర్స్ లాంటి పైరసీ మాఫియా గ్యాంగ్‌లు రకరకాల మార్గాల్లో సినిమాలను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తూ, మేకర్స్‌కి తలనొప్పిగా మారుతున్నాయి.
సైబర్ క్రైమ్ పోలీసుల చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పైరసీని పూర్తిగా అరికట్టడం చాలా కష్టం అవుతోంది.
ది గోట్ మూవీని 400 కోట్లకు పైగా వసూలు చేసింది, మిక్స్డ్ టాక్ రావడంతో ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది.
అయితే, ఇప్పుడు పైరసీ సమస్య మరింత తలనొప్పిగా మారడంతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.