కోలీవుడ్: 2014 లో విడుదలై సూపర్ హిట్ సాధించిన థ్రిల్లర్ మూవీ ‘పిసాసు’ తెలుగు లో ‘పిశాచి’ అనే టైటిల్ తో విడుదలైంది. ఇక్కడ కూడా మంచి గుర్తింపు లభించింది. అందరూ కొత్త వాళ్ళతోనే రూపొందిన ఈ సినిమా ఒక వెరైటీ కాన్సెప్ట్ గా మన్ననలు దక్కించుకుంది. జీవా తో ‘మాస్క్’, విశాల్ తో ‘డిటెక్టివ్’ సినిమాలని డైరెక్ట్ చేసిన మిస్కిన్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. మిస్కిన్ సినిమాలకి ప్రత్యేక అభిమానులు ఉంటారు. సూపర్ డీలక్స్ లాంటి సినిమాకి రచనా సహకారం కూడా అందించారు మిస్కిన్. చివరగా ఉదయనిధి స్టాలిన్ తో ‘సైకో’ అనే సైకో కిల్లర్ కి సంబందించిన సినిమా రూపొందించాడు. ఈ సినిమాలో అంధుడైన హీరో విలన్ ని ఎలా చంపాడు అనే కాన్సెప్ట్ తో బాగా రూపొందించారు.
2014 లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘పిసాసు’ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. ‘పిసాసు 2 ‘ పేరుతో రూపూందనున్న ఈ సినిమాలో ఆండ్రియా జెరెమియా నటిస్తున్నారు. సింగర్ గా పరిచయం అయ్యి యాక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటి ఆండ్రియా. తాను తీస్తున్న సినిమాల్లో థ్రిల్లర్ సినిమాల శాతం ఎక్కువ. ఈ సినిమా ప్రకటన తో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు. ఒక బాత్ టబ్ లో సిగరెట్ కలుస్తున్న చెయ్యి తో పాటు కాళ్ళు బయటకి పెట్టి ఉన్న ఒక అమ్మాయి ఉన్న పోస్టర్ విడుదల చేసారు. రాక్ ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కార్తీక్ రాజా నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది.