దుబాయ్: దాదాపు 8 సంవత్సరాల తరువాత తిరిగి ధోనీ నాయకత్వంలో ఆడడం చాలా సంతోషకరమైన విషయం అని టీమిండియా సీనియర్ లెగ్ స్పిన్నెర్ పీయూష్ చావ్లా అన్నారు. 2012 సంవత్సరంలో చివరిగా టీమిండియాకు ఆదిన పియూష్ చావ్లా ఆ తరువాత దేశవాళీ క్రికెట్లోనూ మరియు ఐపీఎల్ లోనూ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ఆదిన తనను ఈ సారి చెన్నై సూపర్కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే దీనికి ప్రధాన కారణం ధోని అని తెలుస్తోంది.
ఈ విషయం తెలిసిన పీయూష్ చాల సంతోషంతో ఒక కెప్టెన్ కు మన మీద నమ్మకం ఉండడం చాలా మంచి విషయం. దాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తిగా కృషి చేస్తానని, ధోనీ నాయకత్వం లో ఆడడం కన్నా తనకు ఇంకేం కావాలని పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు.
భారత్ టీ20, వన్ డే ప్రపంచకప్ లు గెలిచిన 2007,2011 సంవత్సరంలో పీయూష్ చావ్లా కూడా టీమిండియాలో ఒక ఆటగాడు. ధోనీ కెప్టెన్సీలో బౌలర్లకు స్వేచ్చ ఉంటుందని, అవసరమైతే తప్ప తాను కలుగజేసుకోడని, అయితే వికెట్ల వెనక నుండే తగిన సమయంలో సలహాలు ఇస్తుంటాడని పీయూష్ అన్నడు. గౌతం గంభీర్ కూడా తనకు అలాంటి స్వేచ్చనే ఇచ్చాడన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ లో తను 100 శతం పెట్టి ఆడతానని అన్నాడు.