fbpx
Sunday, April 13, 2025
HomeMovie Newsప్లే బ్యాక్: చనిపోయిన ఆత్మతో ఫోన్ సంభాషణ

ప్లే బ్యాక్: చనిపోయిన ఆత్మతో ఫోన్ సంభాషణ

PlayBack Movie TrailerReleased

టాలీవుడ్: ప్రతి వారం చాలా చిన్న సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అందులో కొన్ని సినిమాలు కంటెంట్ ఉన్నా కూడా స్టార్ కాస్టింగ్ లేనందువలన, పబ్లిసిటీ లేకపోవడం వలన కంటెంట్ ఉండి కూడా వెనకబడిపోతాయి. ప్రస్తుతం అలాంటి ఒక సినిమా విడుదల అవబోతుంది అనిపిస్తుంది. ‘ప్లే బ్యాక్’ అనే ఒక చిన్న సినిమా ట్రైలర్ విడుదలైంది. రొటీన్ కంటెంట్ కాకుండా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ కథ చాలా కొత్తగా అనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం హత్య కాబడిన ఒక వ్యక్తి తర్వాత జెనెరేషన్ వ్యక్తి తో ఫోన్ లో సంభాషిస్తుంటారు.

ఫోన్ లో సంబాషించిన వ్యక్తి కి సంబందించిన హత్య చేసిన వ్యక్తిని ఫోన్ లో సలహాలు చెప్తూనే పట్టుకుంటాడు ప్రస్తుత కథలో ఉన్న హీరో. ఇలాంటి ఒక టిపికల్ లైన్ తో సినిమా తీసి ఆకట్టుకోబోతున్నాడు డైరెక్టర్. ఈ సినిమా కథనం పైనే సినిమా టాక్ ఆధారపడబోతుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదు. ఈ మధ్యనే ‘అంధకారం‘ అనే తమిళ్ డబ్ సినిమా దాదాపు ఇలాంటి స్టోరీలైన్ తోనే వచ్చి ఆకట్టుకుంది. రెండు భిన్నమైన కాలాల్లో ఉన్న వ్యక్తులకి మధ్య టెలిఫోన్ అనే ఒక మీడియం ద్వారా కమ్యూనికేషన్ ఏర్పాటు చేసి సస్పెన్స్ క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్. హుషారు ఫేమ్ దినేష్, మల్లేశం ఫేమ్ అనన్య ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. హరి ప్రసాద్ జక్కా దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా మార్చ్ 5 న థియేటర్లలో విడుదల అవనుంది.

PlayBack Trailer | Dinesh Tej | Ananya Nagalla | Hari Prasad Jakka | Kamran | Madhura Audio​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular