టాలీవుడ్: ఒకప్పుడు తెలుగులో మూస ధోరణి సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఆ తర్వాత కొంచెం క్రియేటివ్ సినిమాలు రావడం మొదలయ్యాయి. పెద్ద హీరోలు కూడా కొత్త ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. మళ్ళీ కొంత కాలంగా దాదాపు చాలా మంది హీరోలు రీమేక్ ల బాట పట్టారు. కానీ ఒక భాషలో కథ లేదా సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఆ సినిమా చూడాలంటే ఫ్రెష్ నెస్ ఫీల్ పోతుంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకుడికి ఉపశమనం అంటే చిన్న సినిమాలే.కొన్ని సినిమాలు కొత్తదనం తో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించకపోయినప్పటికీ హిట్ టాక్ తో అందరి నోళ్ళలో నానుతుంది. ఈ రోజు విడుదలైన ‘ప్లే బ్యాక్’ మూవీ కూడా అదే క్యాటగిరి కి చెందుతుంది. ఈరోజు ఆహా ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఒక హత్యని వేరు వేరు టైం పీరియడ్స్ లో ఉండే ఇద్దరు వ్యక్తులు కలిసి హంతకుడిని కనుకొనడానికి సంబంధించిన ఒక హత్య మిస్టరీ ఈ సినిమా మూల కథ. ఈ కథ తోనే డైరెక్టర్ ముందుగా ప్రేక్షకుడి దగ్గరి నుండి ఒక ప్రశంస అందుకుంటాడు. ఈ కథని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి ప్రేక్షకుడిని సినిమాలో ఎంగేజ్ చేసి మరింత విజయవంతం అయ్యాడు డైరెక్టర్. సినిమా ఆరంభం తోనే ప్రేక్షకుడిని డైరెక్ట్ గా స్టోరీ లోకి ఇన్వాల్వ్ చేయడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అలాగే రెండు వేర్వేరు టైం పీరియడ్స్ లో ఉన్న వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ ని క్రియేట్ చేయడానికి కొంత ఫీజిక్స్, కొంత సినిమాటిక్ లిబర్టీ ని వాడుకున్నప్పటికీ కన్విన్సింగ్ గానే ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళ కంమ్యూనికేషన్ మరియు హీరో లవ్ స్టోరీ రైటింగ్ లో కొంచెం వీక్ అనిపించినప్పటికీ మళ్ళీ హత్య మిస్టరీ ఛేదించడం మొదలుపెట్టినప్పటి నుండి సినిమా గాడిలో పడుతుంది.
టెక్నిషియన్స్ విషయానికి వస్తే డైరెక్టర్ హరి ప్రసాద్ జక్కా ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చాడు. అతను రాసుకున్న కథ పై , స్క్రీన్ ప్లే పై ఇంకొంచెం వర్క్ చేసి ఇంకా ఇంప్రొవైజ్ చేస్తే సినిమా చాలా హైట్స్ కి వెళ్ళేది అని చెప్పవచ్చు. మిగతా టెక్నిషియన్స్ విషయానికి వస్తే మ్యూజిక్ పరవాలేదనిపించింది కానీ పెద్దగా గుర్తుండిపోయేట్టుగా ఏమి ఉండదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమంత స్పెషల్ అనిపించదు. బుజ్జి అందించిన సినిమాటోగ్రఫీ , రెండు టైం పీరియడ్స్ లో కలరింగ్, ఫ్రేమింగ్ సినిమాకి తగ్గట్టు కుదిరాయి అని చెప్పుకోవచ్చు. నిర్మాణ విలువలు కూడా సినిమాకి తగ్గట్టుగా ఉండేట్లు చూసుకున్నారు మేకర్స్.
నటీ నటుల విషయానికి వస్తే మల్లేశం, వకీల్ సాబ్ తో ఆకట్టుకున్న అనన్య నాగిళ్ల ఈ సినిమాలో కూడా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. కానీ తాను నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలంటే ఎక్సప్రెషన్స్ పైన ఇంకొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. హీరో దినేష్ తేజ్ పరవాలేదనిపించాడు. పెద్దగా నెగేటివ్స్ ఏమీ లేకపోయినా అవుట్ స్టాండింగ్ చేయడానికి కూడా స్కోప్ లేదు. ఈ సినిమాతో డెబ్యూ చేసిన TV5 మూర్తి బాగానే చేసాడు. దివంగత జర్నలిస్ట్ TNR కూడా తన పాత్రకి న్యాయం చేసాడు. మరిన్ని పాత్రల్లో నటించిన అర్జున్ కళ్యాణ్, స్పందన తమ పాత్రలవరకి మెప్పించారు.
ఓవరాల్ గా చెప్పాలంటే తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు – ఎంగేజింగ్ టైం ట్రావెల్ థ్రిల్లర్.