టాలీవుడ్: టైం డైమెన్షన్ ని బేస్ చేసుకుని హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చూసి ఉంటాం మనం. సౌత్ లో కూడా సూర్య 24 సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. సినిమా అంతగా ఆడకపోయినా మంచి పేరు సంపాదించింది. ఇపుడు తెలుగులో ‘ప్లే బ్యాక్’ అనే ఒక సినిమా ఇలాంటి టైం డైమెన్షన్ కి సంబందించిన కాన్సెప్ట్ తో మన ముందుకు రానుంది. కానీ ఇది సైన్స్ బేస్డ్ సినిమా కాకుండా థ్రిల్లర్ డ్రామా గా రూపొందిందని అర్ధం అవుతుంది. 1993 కాలం లో ఉన్న ఒక వ్యక్తి ప్రస్తుత (2021 ) కాలంలో ఉన్న వ్యక్తి తో టెలిఫోన్ సంభాషణ సాగించి తన పగ ఎలా తీర్చుకుంది అనే కాన్సెప్ట్ తో సినిమా రూపొందినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
ట్రైలర్ ద్వారా మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 21 న ఓటీటీ లో విడుదల అవనుంది. తెలుగు లో చిన్న సినిమాలని మంచి ఆఫర్ ఇచ్చి విడుదల చేస్తున్న ‘ఆహ’ ఓటీటీ ఈ సినిమాని కూడా విడుదల చేస్తుంది. ‘ప్లే బ్యాక్‘ అనే ఈ సినిమా మే 21 నుండి ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాలో హుషారు ఫేమ్ ‘దినేష్ తేజ్’ హీరోగా, వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగిళ్ల హీరోయిన్ గా నటిస్తుంది. హరి ప్రసాద్ జక్కా దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా మార్చ్ 5 న థియేటర్ లలో విడుదల అవ్వాల్సి ఉండగా చాల కారణాల వలన ఇలా కరొనకి బలి అయ్యి ఓటీటీ లో విడుదల అవుతుంది.