లక్నో: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో సుల్తాన్‌పూర్ జిల్లా కర్వాల్ ఖేరీ వద్ద పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ఘనంగా ప్రారంభించారు. యూపీ ప్రభుత్వం మొదలు పెట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో ఈ పూర్వాంచల్ ప్రాజెక్టు ఒకటి.
దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇవాళ ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో మొత్తం ఆరు లేన్లు ఉండగా, వైమానిక విన్యాసాలకు, యుద్ధ విమానాలు దిగడానికి, టేకాఫ్ కావడానికి కూడా వీలుగా ఈ రోడ్లను నిర్మించారు.
నూతనంగా ప్రారంభించిన ఈ ఎక్స్‌ప్రెస్ వే తో యూపీలోని లక్నో నుంచి బిహార్లోని బక్సర్ మధ్య ప్రయానానికి పట్టే సమయం 3 గంటల వరకు తగ్గనుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే లక్నోలోని చాంద్ సరాయ్‌లో ప్రాంతంలో మొదలై ఘాజీపూర్ జిల్లాలోని హైదరియా గ్రామంలో ముగుస్తుంది.
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే భారత దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే గా నిలిచింది. దీని పొడవు 341 కిలోమీటర్లు. అలగే ఇది అజంగఢ్, బారాబంకి, అమేథి, సుల్తాన్‌పూర్, అయోధ్య, అంబేద్కర్‌నగర్, ఘాజీపూర్, మౌ గుండా తదితర ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది.