విశాఖపట్నం: ఏపీకి ప్రధాని నరేంద్రమోదీ త్వరలో రానున్నారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన ఏపీకి పర్యటించడం ఇదే తొలిసారి.
గతంలో కూటమి ప్రచారంలో భాగంగా గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో బహిరంగ సభలకు హాజరయ్యారు. అయితే, ఎన్నికల అనంతరం ఆయన రాష్ట్రానికి రాలేదు.
ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకోనున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఆయన పర్యటనలో భాగంగా హైడ్రో ప్రాజెక్ట్, ఫార్మా ఎస్ఈజ్, స్టీల్ ప్లాంట్‌కు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్బంగా భద్రత, ఏర్పాటులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రధాని చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించింది.
మరోవైపు, బీజేపీ నేతలు ప్రధాని రాకను తమ పార్టీ బలోపేతానికి వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ పర్యటన అధికారపరమైనది మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.