తెలంగాణ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన ట్వీట్ చేస్తూ, “తెలంగాణ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో జీవించాలంటూ ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి పట్ల రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. పుట్టినరోజు సందర్భంగా రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా, ప్రజలతో మరింత చేరువ అవ్వాలని నిర్ణయించారు. మధ్యాహ్నం మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు.
సాయంత్రం ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు, ఇందులో భాగంగా 2.5 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమం ప్రజలకు సేవా దృక్పథాన్ని చాటుతూ, ముఖ్యమంత్రిగా ప్రజల అభివృద్ధికి అంకితమవ్వాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి చేపట్టిన మరో అడుగుగా చర్చనీయాంశంగా మారింది.