ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో విశేష ప్రాచుర్యం పొందిన నేతగా నిలిచారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉండటమే కాకుండా, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం కూడా సాధిస్తున్నారు.
మోదీ యూట్యూబ్ ఛానెల్ ప్రతి నెల రూ.1.62 కోట్ల నుంచి రూ.4.88 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇప్పటివరకు ఈ ఛానెల్‌లో 29,272 వీడియోలు అప్‌లోడ్ చేయగా, మొత్తం 636 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక్కో వీడియో సగటున 20 వేల వ్యూస్ సాధిస్తోంది.
2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ఈ ఛానెల్‌ను ప్రారంభించారు. తన కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే ఈ ఛానెల్ ఉద్దేశం. 2014లో ప్రధాని అయిన తర్వాత కూడా మోదీ ఈ ఛానెల్‌ను నిరంతరం కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఛానెల్‌కు 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఏ రాజకీయ నేతకు లేని ప్రాముఖ్యత. జైర్ బోల్సోనార్ వంటి ఇతర ప్రముఖ నేతలతో పోలిస్తే, మోదీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య నాలుగింతలుగా ఉంది.
ప్రతీవారంలోనూ 19 వీడియోలు అప్‌లోడ్ చేస్తూ, మోదీ తన ఛానెల్ ద్వారా మరింత ప్రజాదరణ పొందుతున్నారు. ఈ ప్రభావంతో, మోదీ యూట్యూబ్ రంగంలోనూ నూతన రికార్డులు నెలకొల్పుతున్నారు.