ఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మన్మోహన్ సింగ్ ఒక విశిష్ట నాయకుడని, దేశ ఆర్థిక రంగంపై ఆయన వేసిన ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని మోదీ అన్నారు.
గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో పాలనాసంబంధమైన అనేక విషయాలు చర్చించేవాడినని మోదీ గుర్తుచేశారు.
ఆయన జ్ఞానం, వినయం తనపై ప్రత్యేక ప్రభావాన్ని చూపాయన్నారు. నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా మాత్రమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నాల్లో ముందుండేవారని మోదీ ప్రశంసించారు.
ఈ విషాద సమయంలో మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తన సంతాపాన్ని తెలియజేస్తూ, దేశం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్ లాంటి మహానుభావులు దేశానికి స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు.