న్యూఢిల్లీ: 3 రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరిన మోదీ! ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన క్వాడ్ సమావేశం ఈ సారి ముఖ్యమైన సమయాన జరుగుతోంది.
ఇది ఇజ్రాయిల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరియు రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాల నేపథ్యంలో జరిగింది.
ప్రధానమంత్రి అక్కడి కాలమానం ప్రకారం ఫిలడెల్ఫియాకు ఉదయం 10 గంటలకు చేరుకొని, యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్, డెలవేర్ కు వెళ్లి కలవనున్నారు.
వీరిద్దరి మధ్య భారత్-అమెరికా సంబంధాలు, మరియు రష్యా-ఉక్రెయిన్ లో జైర్గిన పర్యటనల గురించి కూడా చర్చించనున్నారు.
అలాగే, భారత్ అమెరికా దేశాల మధ్య అంతరిక్ష సహకారం పై కుడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
దీనిలో భాగంగా గ్రూప్ కెప్టెన్ శుభంశు శుక్లా అక్సియమ్-4 మిషన్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కి ప్రయాణించనున్నారు.
పర్యటన రెండో రోజు, ప్రధాని మోదీ న్యూయార్క్ లో భారతీయ సమాజంతో సమావేశం నిర్వహిస్తారు మరియు ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేసమువుతారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, సెమీ కండక్టర్లలో సహకారం పై కూడా చర్చలో మాట్లాడే అవకాశం ఉంది.
ఇక మూడవ రోజు, సెప్టెంబర్ 23 న, మోదీ న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘భవిష్యత్తు సదస్సు’ ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఐక్యరాజ్యసమితి సదస్సు సందర్భంలో ఇతర ప్రపంచ నాయకులతో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి మోదీని కలుస్తానని తెలిపారు.
అధ్యక్షుడు బైడెన్ తో జరిపే ద్వైపాక్షిక సమావేశం ద్వారా భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టబోతున్నామని మోదీ చెప్పారు.