ఢిల్లీ: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ హృదయాన్ని హత్తుకునే లేఖ రాశారు.
అశ్విన్ కెరియర్‌ను ప్రశంసిస్తూ, ఆట కోసం త్యాగం చేసిన అతని అంకితభావాన్ని ప్రధాని కొనియాడారు. రిటైర్మెంట్ ప్రకటనను ‘‘క్యారమ్ బాల్’’తో పోల్చుతూ, అభిమానులందరికీ ఆలోచనలో పడేసిందన్నారు.
మోదీ తన లేఖలో అశ్విన్ ఆటకు సేవలను కొనియాడారు. జట్టును ఎప్పుడూ ముందుంచిన ఆటగాడిగా ప్రశంసించారు.
765 అంతర్జాతీయ వికెట్లు సాధించిన అశ్విన్ టెస్టుల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను గెలుచుకున్నారన్న విషయాన్ని గుర్తుచేశారు.
మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం, సెంచరీ చేయడం ద్వారా అతని ఆల్‌రౌండర్ నైపుణ్యాన్ని అద్భుతంగా చూపించారని అభినందించారు.
అతడి తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పుడు జట్టుకు ప్రాధాన్యతనిచ్చి, చెన్నై వరదల సమయంలో జట్టుతోనే కొనసాగిన సంఘటనలను ప్రస్తావించారు.
భవిష్యత్తులో క్రికెట్‌కు మరింత సేవ చేయాలని పిలుపునిచ్చిన మోదీ, అశ్విన్ తదుపరి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ లేఖతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.