న్యూఢిల్లీ: దేశంలొ రోజుకు 3 నుండి 4 లక్షల వరకు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ లో అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆందులో ఆక్సిజన్ లభించక జరిగే మరణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలొ కేంద్ర ప్రభుత్వం పై అన్ని వైపుల నుండి విమర్శలు ఎక్కువయ్యాయి.
కరోనా కట్టడి పై ఒక వైపు విపక్షాలు మరో వైపు కోర్టులు కేంద్రాన్ని ఇరుకున పెట్టాయి. తాజాగా సూప్రీం కోర్టు కోవిడ్ నియంత్రణ కోశం లాక్డౌన్ మరియి ఇతర నియంత్రణ చర్యలపై కేంద్ర వైఖరిని కోరింది. కోవిడ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా లాభం లేకుండా పోతుంది.
ఈ సమయంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా విఫలం అవుతున్నాయి అన్ని ప్రభుత్వాలు. దేశంలో కోవిడ్ కట్టడికి లాక్‌డౌనే సరైన నిర్ణయం అని సుప్రీంకోర్టుతో సహా పలువురు ప్రముఖులు, సర్వేలు తెలుపుతున్నాయి.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌కు సంబంధించి కీలక సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా తాము లాక్‌డౌన్ ప్రకటించలేమని, ఇందుకు సంబంధించి ఆ ఆ రాష్ట్ర ప్రభుత్వాలే తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇక ఇప్పటికే కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు వారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించి పరిస్థితి కట్టడికి ప్రయత్నిస్తున్నాయి.