అమరావతి: పోలవరం, ఆంధ్రప్రదేశ్ కు ఇది ఒక కలల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రంలో సగం పైగా జనాభాకు సాగు, తాగునీరు అందుబాటులోకి వస్తాయి. గత కొన్ని దశాబ్ధాలుగా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నది ప్రజల చిరకాల కోరిక.
పోలవరం పనులు మేఘా కంపెనీ ఆధ్వర్యంలో వాయువేగంతో పనులు నడుస్తున్నాయి. కరోనా వచ్చినా, వరదలు ముంచెత్తినా పనులు మాత్రం ఆగకుండా జోరుగా సాగుతున్నాయి. రాత్రి పూట కూడా పనులు జరుగుతున్నాయి. అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే యూనిక్యూ మెషీన్లను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆ సంస్థ వాడుతూ పనులు పూర్తి చేస్తోంది. డెడ్ లైన్ లోపల ప్రాజెక్ట్ పూర్తి చేయాలని పట్టుదలతో ముందుకెళుతోంది.
మేఘా ఇంజనీరింగ్ సంస్ద ఈ సంవత్సర కాలంలో స్పిల్ వేను శరవేగంతో పూర్తి చేస్తోంది. అంతకు ముందు పియర్స్ ఎత్తు సరాసరి 28 మీటర్లు ఉంటే.. ఇప్పుడు 52 మీటర్లు కు నిర్మాణం పూర్తి కావడం విశేషంగా చెప్పొచ్చు. స్పిల్ వేలో ఇప్పటి వరకు 1,94,944 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ నిర్మాణం పూర్తి అయ్యింది. స్పిల్ ఛానెల్ లో 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని,10,64,417 క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వకం పనులు ఇప్పటివరకు పూర్తయ్యాయి.
కరోనా కాలంలో.. గోదావరి ఉగ్రరూపంతో పొంగుతున్న సమయంలోనూ మేఘా సంస్థ పోలవరంను పరుగులు పెట్టిస్తోంది. గడువులోపు పూర్తి చేసి తరతరాల నిర్లక్ష్యానికి చెక్ పెట్టాలని యోచిస్తున్నాయి.